15
Sep'23
ఓం నమః శివాయ. అందరికీ ఆహ్వానము.
శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములు - ది.15/10/23 నుండి 24/10/23 వరకు
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీశుభకృత్ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు అనగా ది.15/10/23 ఆదివారం నుండి 24/10/23 మంగళవారం వరకు సాగమంగళముగా జరుగును
దసరా కలశ స్థాపన 15/10/23 ఉదయం 11:15ని॥లకు సూర్యస్వర, వాయు తత్వం చిత్త నక్షత్రయుక్త ధను లగ్నమందు జరుగును భక్త జనులందరూ భక్తి,శ్రద్ధలతో పాల్గొని జగన్మాత కృపాపాతృలై తరించగలరని తెలియజేయుచున్నాము.

15/10/23 ఆదివారం పాడ్యమి
శ్రీ బాలాలలితా త్రిపురసుందరీ అమ్మవారు-శ్రీశైలపుత్రీదుర్గా , మహాకాళీ

16/10/23 సోమవారం విదియ
శ్రీబాలా త్రిపుర సుందరీ అమ్మవారు - శ్రీబ్రహ్మచారిణీ దుర్గా , తారా దేవి

17/10/23 మంగళవారం తదియ
శ్రీ గాయత్రీ అమ్మవారు - శ్రీ చంద్రఘంటా దుర్గా, భువనేశ్వరీ దేవి

18/10/23 బుధవారం చవితి
శ్రీ లలితా త్రిపుర సుందరీ అమ్మవారు - శ్రీ కూష్మాండా దుర్గా, ఛిన్నమస్తా దేవి

19/10/23 గురువారం పంచమి
శ్రీ అన్నపూర్ణా అమ్మవారు - శ్రీ స్కందమాతా దుర్గా , శ్రీధూమావతి దేవి

20/10/23 శుక్రవారం షష్టి
శ్రీ సరస్వతి అమ్మవారు - శ్రీ కాత్యాయనీ దుర్గా,శ్రీ బగళాముఖీ దేవి

21/10/23 స్థిరవారం సప్తమి
శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు - శ్రీ మాతంగీ దేవి, శ్రీ కాలరాత్రీ దుర్గా

22/10/23 ఆదివారం దుర్గాష్టమి
శ్రీ దుర్గా అమ్మవారు - శ్రీ మహాగౌరీ, శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి

23/10/23 సోమవారం మహర్నవమి
శ్రీ మహిషాసుర మర్ధనీ అమ్మవారు - శ్రీ సిద్ధిదాత్రీ దుర్గా, శ్రీ మహా త్రిపుర భైరవీ దేవి

24/10/23 మంగళవారం విజయదశమి
శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు,శ్రీ మహాత్రిపురసుందరీ దేవి
*గమనిక* : ఈ కార్యక్రమములన్నీ మీ అందరి భక్తి పూర్వక సహాయ,సేవలతో జరుగుచున్నవి,ఇవి ఎంతో విలువైన కార్యములు కావున మీరు అందరూ పాల్గొనుటయే గాక,బంధు,మితృలందరినీ పాల్గొనేట్లు చేసి అమ్మ దయ పొందగలరు.
మీ గోత్రనామములు నమోదు చేసుకో గలరు contact – 9912331114