శారదా శ్రీవిద్యా పీఠము, వీరశైవ ఆశ్రమం మల్లేశ్వరం గ్రామమున పెరవలి మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కలదు .ఈ పీఠానికి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివయోగి సిద్ధ దత్త అవధూత మహా స్వామి వారు .ఈ పీఠము గురు పరంపర తో అవిచ్ఛిన్నంగా విరాజిల్లుతున్న పీఠము. ఈ పీఠమున కు పూర్వ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ కృష్ణ పరమహంస స్వామి వారు. వీరు 16 సంవత్సరముల వయసులోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆసేతు హిమాచలం భారతదేశం అంతటా కాలినడకన మూడు సార్లు పరిక్రమణ చేసినారు. పరమ గురుదేవులు సిద్ధ పురుషుడు మహాయోగి సుబ్రహ్మణ్య ఉపాసకులు. సుమారు రెండు వందల సంవత్సరముల కాలం జీవించి ఉన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినీ సజీవముగా దర్శించుకున్న అటువంటి మహా యోగి పుంగవులు. ఈ కలియుగంలో కూడా సన్యాస ధర్మాన్ని విధి యుక్తంగా ఆచరించిన గొప్ప యోగి. పరమ గురుదేవులు 80 సంవత్సరాల క్రితం వెలిగించిన అఖండ (నందా)దివ్య జ్యోతులు నిర్విరామంగా నిరంతరము వెలుగుతూనే ఉన్నాయి. పరమ గురుదేవులు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస మహాస్వామి వారు సుబ్రహ్మణ్య ఐక్యం తరువాత వారి శిష్యులు శ్రీ శ్రీ శ్రీ శివయోగి సిద్ధ దత్త అవధూత మహా స్వామి వారు ఆ దీపాలను ఆశ్రమంలో పరి రక్షిస్తున్నారు. ఈ పీఠంలో బాలా లలితాంబికా సమేత సిద్ధ కేదార మహా లింగేశ్వర స్వామి వారు అఖండ దీపం మధ్య సుప్రతిష్ఠులయి వున్నారు. ఇచ్చట నున్న బాల లలితా మహా త్రిపుర సుందరి త్రిశక్తి స్వరూపిణి. అలాగే మహా గణపతి స్వామి, బీజాక్షర సంపుటీకరణ తో కూడిన ఆరవణ చక్ర సహితముగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. స్పటిక లింగ రూపములో సిద్ద కేదార మహా లింగేశ్వర స్వామి వారు మరియు పంచలోహాలతో నిర్మితమైన (16*16150 కేజీలు బరువు కలిగిన) అత్యంత శక్తి కలిగిన శ్రీ చక్ర మేరు యంత్ర సహితముగా బాలా లలితా మహాత్రిపురసుందరి దేవి ఉన్నారు.
ఈ మఠంలో ప్రతి నిత్యము బీజాక్షరీ సహిత శ్రీ మహాగణపతి పూజ, అరవణ చక్ర సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, సిద్ధ కేదార మహా లింగేశ్వర స్వామి కి ప్రతి నిత్యము రుద్రాభిషేకాలు, బాలా లలితాంబికా దేవికి కుంకుమార్చన, బీజాక్షర సహిత శ్రీ చక్ర నవావరణ అర్చన, అమ్మవారి పాదుకలకు అభిషేకం, పరమ గురుదేవులు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస స్వామి వారి నిజ పాదుకలకు అభిషేకం జరుగుచున్నవి. ఈ మఠంలో గురు పంచ పర్వాలు ఆచరించబడుతున్నవి. ప్రతి సంవత్సరము గురుపౌర్ణమి ,ఆశ్వయుజ శరన్నవరాత్రులు ,పుష్య శుద్ధ పౌర్ణమి విశేషముగా జరుగుచున్నవి. ప్రతి మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున ఆశ్రమంలో విశేషముగా శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ జరుగును. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు స్వామి వారు అనేక సంవత్సరముల నుండి అద్వితీయమైన మహిమలను చూపించారు. ఆశ్రమములో ప్రతి నిత్యము శ్రీరామ నామ సంకీర్తన, శివనామ సంకీర్తన జరుగును.
గురుదేవులు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివయోగి సిద్ధ దత్త అవధూత మహా స్వామి వారు ఆశ్రమమునకు వేంచేసి ఉన్నటువంటి భక్తులకు యోగ సాధన రహస్యములను, కుండలినీ యోగ సాధన, స్వర యోగ సాధనను, అష్టాంగ యోగ ములను నేర్పుతున్నారు. ప్రతిరోజు భక్తులకు శిష్యులకు భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము ,రాజయోగము వీటికి సంబంధించిన సత్సంగములు నిత్యము జరుగుతూ ఉన్నాయి. గురుదేవులు శక్తి విశిష్ట అద్వైతాన్ని ప్రబోధిస్తూ నిత్యము ఇష్ట లింగార్చన గావించి వీరశైవ ధర్మ విశిష్టతను ఈ లోకమునకు వెల్లడి చేస్తున్నారు. గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ శివయోగి సిద్ధ దత్త అవధూత మహా స్వామి వారు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస సేవాసమితి ని ప్రారంభం చేసి, ఎందరో అనాధ బాలబాలికలకు, సాధు మహాత్ములకు, నిర్విరామంగా సేవ చేస్తూనే ఉన్నారు. ఈ సంస్థ ద్వారా పేదలకు అన్నసమారాధన రోగి నారాయణ సేవ చేస్తున్నారు. ఆశ్రమములో ప్రతి సంవత్సరము పుష్య శుద్ధ పౌర్ణమి రోజు పరమ గురుదేవులు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస స్వామి వారి ఆరాధనోత్సవం జరుగును .ఆరోజు పూజలో పాల్గొన్న భక్తులకు, శిష్యులకు ,శరణాగతులకు వారి ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తు అనేక దివ్యమైన మహిమలను చూపిస్తున్నారు. ముఖ్యముగా వివాహ సంబంధమైన సమస్యలు, సంతాన సంబంధమైన సమస్యలు,గ్రహదోష సంబంధించిన సమస్యలు, ఈ పూజలో పాల్గొన్న భక్తులకు అతి శీఘ్రముగా తొలగిపోతున్నాయి.
ప్రతి నిత్యము నవగ్రహ సంబంధమైన దోషములు పోవటానికి మంత్ర ,తంత్ర యంత్ర సహితముగా జపములు పూజలు జరుపబడును.
శ్రీమద్ గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ శివయోగి సిద్ధ దత్త అవధూత మహా స్వామి వారు శ్రీ విద్యా ఉపాసకులు, స్వర తత్వశాస్త్ర ప్రవీణులు, అవధూత, సాక్షాత్తూ నడయాడే శివాలయం, సిద్ధ పురుషులు, సాక్షాత్తు శారదా దేవి దర్శన భాగ్యం కలిగిన మహాయోగి. జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానంలో అమోఘమైన పాండిత్యం కలవారు. పరమ గురుదేవులు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస స్వామి వారు గురుదేవుల ను చేరదీసి తన దేహాన్ని శిష్యుని కొరకు 12 సంవత్సరాలు అధికముగా నిలుపుకొని మొదటి ఏడు సంవత్సరములలో కఠినాతి కఠినమైన పరీక్షలు చేసి, మట్టి లో ఉన్న మాణిక్యాన్ని వజ్రాయుధంగా తయారుచేసి ,శిష్యునిలో ఉన్న దివ్యమైన చైతన్య శక్తులను ఉద్దీపన చేసి, అనేక మంత్రసాధన లను యోగసాధనల చేయించి శిష్యుని యొక్క సమస్త కర్మలను భస్మం చేసి పరిశుద్ధునిగా చేశారు. పరమ గురుదేవుల ప్రసాదించిన దివ్య శక్తులతో ఆశ్రమానికి వచ్చే భక్తులకు ,శిష్యులకు ,శరణాగతులకు వారి వారి కష్టాలను తీర్చి ఎన్నో విశేషమైన మహిమలను చూపుతున్నారు.
పరమ గురుదేవుల అనుగ్రహం తో గురుదేవులకు జన్మించిన కుమారుడిని ఉత్తర పీఠాధిపతిగా ప్రతిపాదించారు. వారే శివశ్రీ దత్త కార్తికేయ స్వామి. దత్త కార్తికేయ స్వామి శ్రీశైలంలో వీరశైవ ఆగమ శాస్త్రాన్ని(కృష్ణ యజుర్వేదాన్ని) అభ్యసించి, కాశీ జగద్గురువుల అనుగ్రహముతో మైసూరు సంస్కృత పాఠశాలకు వెళ్లి సంస్కృత విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు. వీరు జ్యోతిష్య శాస్త్రము వాస్తు శాస్త్రము అధ్యయనము చేసి మహా పండితుల చేతుల మీదగా వాస్తు విద్వాన్ అనే బిరుదును పొందారు. ప్రస్తుతం ఆశ్రమం లోనే ఉంటూ మూలవిరాట్టు లకు పూజలను అందిస్తూ, ఆశ్రమ వ్యవస్థాపకులు గా ఉన్నారు.
శ్రీ శ్రీ కృష్ణపరమహంసస్వామి

శ్రీ శ్రీ కృష్ణపరమహంసస్వామి కేరళ రాష్ట్రంలో పాల్ ఘాట్ జిల్లాలో ముండూరు గ్రామంలో శ్రీరాఘవమీనన్ జానకీదేవిల గర్భఫలంగా ఉదయించి 6వ ఏట వారినుండి తప్పిపోయి,మధుర చేరుకుని మధుర మీనాక్షిదేవి ఆలయ అర్చకుల పోషణలో పెరిగి 14వ ఏట సన్యసించి 16వ ఏట తీర్ధయాత్రాసక్తులై వేదభూమి,ధర్మభూమి,కర్మభూమి ఐన యావద్భారత దేశం మూడు సార్లు ప్రదక్షిణ చేసారు.యావత్ ప్రపంచ మహాసభలలో ఘనంగా సన్మానించబడిన మరియు శ్రీరామకృష్ణ పరమహంసస్వామి ప్రధాన ప్రియశిష్యులు “శ్రీ స్వామి వివేకానందను”,శ్రీరామనాధపురం మహారాజావారి బంగారురధం,ఐదుగురు చక్రవర్తులను దర్శించారు.వారిలో ఇద్దరు చక్రవర్తులు ఆశ్రమం కట్టించి రాజ్యంలో ఉండమని స్వామివారిని కోరారు, స్వామివారికి స్వతంత్రేచ్ఛ,యాత్రాసక్తి ఉండడం వలన స్వామి ఆశ్రమవాసన్ని అంగీకరించలేదు.అయితే ఒకానొక సంధర్భంలో స్వామి ఒక భైరాగిని చూశారు. ప్రతిమనిషిలోనూ, చెట్టులోనూ, పుట్టలోనూ,దైవాన్నే వీక్షించే ఆ భైరాగి స్వభావం “ఎక్కడో తీర్ధాక్షేత్రాలలో మాత్రమే దేవుడు ఉన్నాడు” అనుకునే స్వామి అభిప్రాయాన్ని మార్చి వేసింది. ఈ సృష్టి సర్వమునందు వ్యాపించి వున్న సృష్టికర్త(దైవము)ను చూడగలగాలి,అజ్ఞానులైన మూఢులకు మనకు తెలిసిన జ్ఞానమును అందించాలి అనే అభిప్రాయము కలిగినది.
శ్రీ శివయోగి సిద్ధ దత్త అవధూత స్వామి

శ్రీ శ్రీ కృష్ణపరమహంసస్వామి కేరళ రాష్ట్రంలో పాల్ ఘాట్ జిల్లాలో ముండూరు గ్రామంలో శ్రీరాఘవమీనన్ జానకీదేవిల గర్భఫలంగా ఉదయించి 6వ ఏట వారినుండి తప్పిపోయి,మధుర చేరుకుని మధుర మీనాక్షిదేవి ఆలయ అర్చకుల పోషణలో పెరిగి 14వ ఏట సన్యసించి 16వ ఏట తీర్ధయాత్రాసక్తులై వేదభూమి,ధర్మభూమి,కర్మభూమి ఐన యావద్భారత దేశం మూడు సార్లు ప్రదక్షిణ చేసారు.యావత్ ప్రపంచ మహాసభలలో ఘనంగా సన్మానించబడిన మరియు శ్రీరామకృష్ణ పరమహంసస్వామి ప్రధాన ప్రియశిష్యులు “శ్రీ స్వామి వివేకానందను”,శ్రీరామనాధపురం మహారాజావారి బంగారురధం,ఐదుగురు చక్రవర్తులను దర్శించారు.వారిలో ఇద్దరు చక్రవర్తులు ఆశ్రమం కట్టించి రాజ్యంలో ఉండమని స్వామివారిని కోరారు, స్వామివారికి స్వతంత్రేచ్ఛ,యాత్రాసక్తి ఉండడం వలన స్వామి ఆశ్రమవాసన్ని అంగీకరించలేదు.అయితే ఒకానొక సంధర్భంలో స్వామి ఒక భైరాగిని చూశారు. ప్రతిమనిషిలోనూ, చెట్టులోనూ, పుట్టలోనూ,దైవాన్నే వీక్షించే ఆ భైరాగి స్వభావం “ఎక్కడో తీర్ధాక్షేత్రాలలో మాత్రమే దేవుడు ఉన్నాడు” అనుకునే స్వామి అభిప్రాయాన్ని మార్చి వేసింది. ఈ సృష్టి సర్వమునందు వ్యాపించి వున్న సృష్టికర్త(దైవము)ను చూడగలగాలి,అజ్ఞానులైన మూఢులకు మనకు తెలిసిన జ్ఞానమును అందించాలి అనే అభిప్రాయము కలిగినది.
Ashramam

Hindu Ashramams are serene havens of spiritual exploration, guided by wise gurus, fostering communal unity, holistic well-being, scriptural study, and cultural celebration, often promoting eco-friendly living.
Key features of Hindu Ashrams include:
- Spiritual Retreats: Tranquil sanctuaries for meditation and self-discovery.
- Guru’s Guidance: Enlightened mentors impart wisdom and teachings.
- Community Living: Emphasis on unity, humility, and selfless service.
- Holistic Wellness: Yoga, meditation, and Ayurveda for physical and mental balance.
- Cultural Celebration: Observing Hindu festivals and rituals.
- Philosophical Study: Deepening understanding through scriptural exploration.
- Intensive Workshops: Retreats for immersive spiritual practice.
- Environmental Awareness: Some promote eco-friendly and sustainable living.
Lineage

“Hindu Swamyji’s lineage” is a broad term that can refer to the spiritual line of succession or lineage of Hindu gurus, teachers, or leaders. These lineages are often associated with specific spiritual traditions or schools of thought within Hinduism.
In such lineages, a guru passes on their teachings, spiritual practices, and guidance to their disciples, who in turn become teachers and continue the tradition. This succession helps maintain the integrity of spiritual teachings and practices over generations.
Lineages can vary widely in terms of the deities they worship, the philosophies they follow, and the practices they emphasize. They play a crucial role in preserving and transmitting the rich spiritual heritage of Hinduism, fostering a sense of community and continuity among followers. Devotees often seek guidance, inspiration, and knowledge from the revered leaders within these lineages.